ప్రతి జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు – సీఎం కేసీఆర్‌

-

ప్రతి జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్‌. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం కేసీఆర్.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది.

పేద ప్రజలకు ఉత్తమమైన వైద్యసేవలుఅందించడంలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించిందన్నారు. తెలంగాణలో మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యవిద్యను చేరువచేస్తూ,వైద్యసేవలను మరింత విస్తృతం చేయాలన్న సదాశయంతోరాష్ట్రంలోని ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ,నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పారు. దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 వైద్యకళాశాలలను ప్రారంభించి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 8 మెడికల్ కాలేజీలను వచ్చే ఏడాది ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నామన్నారు. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని ప్రభుత్వం చేరుకోబోతున్నదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news