కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఇంతకుముందు రైతాంగానికి మేము చెప్పామని.. కేంద్రంలో పనికి మాలిన ప్రభుత్వం ఉందని… దీంతో 20 లక్షల ఎకరాలు వరి పంటను తగ్గించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే కొంటుందని బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఇచ్చినా… మేం మా రైతులను బాధపెట్టమని, మా రైతాంగాన్ని చెడగొట్టుకోలేమని సీఎం కేసీఆర్ అన్నారు. యాసంగిలో వడ్లు లేకుండా ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడి
-