సబితా ఇంద్రారెడ్డి ప్రజల కోసం తపించే నాయకురాలు : కేసీఆర్

-

సబితా ఇంద్రారెడ్డి నిరంతరం ప్రజల కోసం తపించే నాయకురాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలకు వచ్చిన సమస్యలు నిత్యం పరిష్కరిస్తున్నారని.. రూ.వంద కోట్లుతో నాలా సమస్యలు పరిష్కరించారని తెలిపారు. సబిత కృషితోనే కందుకూరులో మెడికల్‌ కళాశాల వచ్చిందని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు.

“మూడు గంటలు కరెంట్ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. వంటలు చేసి పెట్టండి మేము వడ్డిస్తామన్న సామెతలా ఉంది కాంగ్రెస్‌ తీరు. ఇంటింటికి తాగునీరు అందించాం. 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందునే సంపద పెరిగింది. మళ్లీ అధికారంలోకి రాగానే అందరి పింఛన్‌ పెంచుతాం. 24గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌, బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతుబంధు వంటి పథకాలతో వ్యవసాయదారుల కుటుంబాలు కళకళలాడుతున్నాయి. రైతుబంధు దుబారా అని పీసీసీ మాజీ అధ్యకుడు చెబుతున్నారు. రైతుబంధు ఎకరానికి రూ.16వేలు చేస్తాం. రైతులకు 24 గంటలు విద్యుత్‌ వృధా అని.. 3 గంటల సరఫరా సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే..ధరణీ తొలగిస్తే మళ్లీ అరాచకమే. ఓటు జాగ్రత్తగా వేయకుంటే పదేళ్లుగా చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.” అని కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news