‘మారకుంటే మార్చేస్తాం’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

-

రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రక్షాళన షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రజల్లో కాస్త నెగిటివిటీ ఉన్న ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఫోకస్ చేశారు. అలాంటి ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టికెటు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తామంతట తాము పొరపాట్లు చేస్తే తప్ప ఈసారి ఎన్నికల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలెవరినీ మార్చే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను పిలిచి కేసీఆర్ హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించడం లేదని, ఎక్కువ కాలం బయటే గడుపుతున్నారని, మారకుంటే ఇబ్బంది తప్పదని ఒకరికి.. కింది స్థాయి నాయకులను కలుపుకొని వెళ్లడం లేదని మరొకరికి.. ఇలా పలువురు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి మందలించినట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అప్రమత్తం చేస్తూ.. నడవడిక మార్చుకోకుంటే నిర్ణయం మరోలా ఉంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే పిలిపించి చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news