ఈనెల 19,20 తేదీల్లో జిల్లాల పర్యటనకు సీఎం కేసీఆర్‌

-

సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన ఫిక్స్‌ అయింది. ఈ నెల 19 , 20 తేదీల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 19వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. నిర్మాణం పూర్తి చేసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీన (ఆదివారం) ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూర్యాపేట జిల్లా పర్యటన చేపట్టనున్నారు. పర్యటన లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో.. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభంకానుంది. అనంతరం సూర్యాపేట జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news