గాంధీజీ చెప్పినట్టే.. గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యత : సీఎం కేసీఆర్

-

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బ్రిటీష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం యావత్ ప్రపంచ చరిత్రలోనే మహోన్నత పోరాటంగా నిలిచిందని పేర్కొన్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్ వంటి చాలా మంది వీరుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.  

సుభాష్ చంద్రబోస్ వీరత్వం నేటికి మనకు స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు. గొప్ప నాయకులలో గాంధీజీ అగ్రగన్యులని తెలిపారు.  చివరికీ మతోన్మాదుల చేతిలో గాంధీజీ హత్యకు గురికావడం చాలా బాధకరమన్నారు.గాంధీజీ చూపిన అహింసా పద్దతిలోనే తెలంగాణ ఉద్యమం సాగిందని చెప్పారు. గాంధీజి చెప్పినట్టుగానే గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలపై గాంధీజీ ప్రభావం ఎంతో ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్. 

 

Read more RELATED
Recommended to you

Latest news