కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయి : సీఎం రేవంత్

-

రాష్ట్రంలో కేసీఆర్‌ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, ఆయన నాటిన కొన్ని గంజాయి మొక్కలు ఇంకా వాసనలు వెదజల్లుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్ తమకు నోటీసులు ఇచ్చిందని, ముందుగా డబ్బు కట్టాకే జీరో విద్యుత్‌ బిల్లు ఇవ్వాలని నోటీసు ఇచ్చిందని తెలిపారు. ముందుగా సబ్సిడీ చెల్లించాకే జీరో బిల్లు ఇవ్వాలని చెబుతున్నారని, రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చినప్పుడు ఈ ఆదేశం ఎందుకు ఇవ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. తన ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన తాను పన్నీరు కాలేరని ఈఆర్సీ ఛైర్మన్ రంగారావును ఉద్దేశించి అన్నారు.

“రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు తన్నీరుకు ఆ తెలివిలేదా? అందుకే ఈ గంజాయి మొక్కలను పీకే పని మీద ఉన్నాను. ఇప్పటికే కొన్ని గంజాయి మొక్కలు పీకాను. ఇంకా పీకాల్సినవి ఉన్నాయి. రోజుకు 18 గంటలు పని చేస్తా.. గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తా. తన్నీరు గారూ.. గుర్తు పెట్టుకోండి.. నువ్వు కూడా ఆ కుర్చీలో ఎక్కువ సేపు ఉండవు.” అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news