CM Revanth: ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం

-

హైడ్రా ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు కబ్జా చేసిన ఎవరినీ వదిలిపెట్టనని హెచ్చరించారు. ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు రేవంత్ రెడ్డి. ఎఫ్టిఎల్, బఫర్ జోన్, పార్కులు, నానాల కబ్జాలే తమ మొదటి ప్రాధాన్యం అని తెలిపారు. బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలో తన కుటుంబ సభ్యులకు సంబంధించిన కట్టడాలు ఉంటే వివరాలు తెలిపాలని.. వాటిని తానే దగ్గర ఉండి కూల్చి వేస్తానని పేర్కొన్నారు.

ఇక రైతు రుణమాఫీ 2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొత్తానికి కడితే రుణమాఫీ అయిపోతుందని.. వాటికి నిధులు కూడా విడుదల చేశామన్నారు. బిఆర్ఎస్ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి రుణమాఫీ కాని వారి లెక్కలు సేకరించి కలెక్టర్ కి ఇవ్వాలన్నారు రేవంత్. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు దగ్గరికి వెళ్లాలని.. రుణమాఫీ కానీ రైతుల లెక్కలు సేకరించి కలెక్టర్ కి ఇవ్వాలన్నారు.

రుణమాఫీ విషయంలో సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయకుండా మాట మార్చారని.. ఆయన దొంగ అని ముందే తెలుసు అన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ చేయాలని విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ మభ్యంతరంగా వచ్చి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news