CM Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పిన ఆయన… గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 ఏళ్లుగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ధన్యవాదాలు అన్నారు. నిష్ట తో , భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు.
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నీ కూడా ఆహ్వానించాము..నగరంలో లక్ష కు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. అన్ని మండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని ఆదేశించామని.. ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించేందుకు కృషి చేశారని తెలిపారు. PJR ఉన్నప్పుడు ఎంతో ఘనంగా నిర్వహించేవారని… ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగుతోందన్నారు. గత ఏడాది కూడా పీసీసీ అధ్యక్షుడు గా వచ్చాను…ఈ ఏడాది ముఖ్యమంత్రి హోదా లో రావడం తొలిసారని వెల్లడించారు. భవిష్యత్ లో కూడా మీ ఆహ్వానం మేరకు రావడానికి సంతోషిస్తున్నానన్నారు.