కాళేశ్వరం వెళ్లి… ఇంకా ఏమైనా కూలిందా..? మిగిలిందా? అని చూశారా – సీఎం రేవంత్‌

-

కాళేశ్వరం వెళ్లి… ఇంకా ఏమైనా కూలిందా..? మిగిలిందా? అని చూసి వచ్చారా అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చురకలు అంటించారు. నిన్న కేటీఆర్‌ బృందం మేడిగడ్డకు వెళ్లడంపై కౌంటర్‌ ఇచ్చారు రేవంత్‌. హరీష్ రావు సభను సభ్యులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని… మోటార్లకు మీటర్ల విషయంలో వాళ్లేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. ఇది అబద్ధం… వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదన్నారు.

ఈ విషయంలో రికార్డులను సవరించాల్సిన అవసరం ఉందని… మీటర్ల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సభ ముందు ప్రవేశపెడుతున్నానని తెలిపారు. ఆరు నెలల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ వద్ద మీటర్లు బిగిస్తామని జనవరి 4, 2017న ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంపై అధికారులు అజయ్ మిశ్రా, రఘుమా రెడ్డి, ఏ.గోపాల్ రావు సంతకం పెట్టారన్నారు. మోదీ ప్రభుత్వంతో ఆనాడు ఆరునెలల్లోగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ కు మీటర్లు బిగిస్తామని కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని… సభలో నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్న హరీష్ రావు.. వారి హయాంలో జరిగిన ఒప్పందాలను చదువుకుని మాట్లాడాలని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version