కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కేంద్ర మంత్రి  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశ వాదులు అని పేర్కొన్నారు. అవకాశం వస్తే.. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి రాకపోవడం దుర్మార్గం అని విమర్శించారు.

అసెంబ్లీ బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు గాడిద గుడ్డు అని సెటైర్లు వేశారు బండి సంజయ్. మర్చంట్ బ్యాంకర్ల ద్వారా రూ.వేల కోట్లను అప్పు తెచ్చే కుట్రను కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు అని ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. గతంలోనే విలీనం చేస్తామని మొన్న అసెంబ్లీలో కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version