చైనాలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ముఖం పై వాలినటువంటి ఈగను చంపడంతో ఏకంగా కంటినే కోల్పోయాడు. అతనికి ఇన్ ఫెక్షన్ కావడంతో అతని ఎడమ కన్ను యొక్క గుడ్డును తొలగించాల్సి వచ్చింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వూ అనే వ్యక్తి ముఖం పై ఈగ వాలుతూ ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో ఆ ఈగను చంపేశాడు.
ఈగను చంపిన ఒక గంట తరువాత అతని ఎడమ కన్ను ఎర్రగా మారింది. తీవ్ర నొప్పి రావడంతో వెంటనే వైద్యులను సంప్రదించాడు. మెడిసిన్స్ తీసుకున్న తరువాత పరిస్థితి మరింత దిగ జారింది. చివరికీ అతని ఎడమ కంటినే తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. చైనాలోని గ్వాంగ్ డాండ్ లోని దక్షిణ ప్రావిన్స్ లో షెన్ జెన్ లో నివసిస్తున్న వ్యక్తికి సీజనల్ కండ్ల కలక వ్యాధఇ నిర్థారణ అయినట్టు అవుట్ లెట్ నిర్థారించింది. అతని కంటి చూపు పోవడానికి డ్రైన్ ఫ్లై అని తేలింది. దాని యొక్క లార్వా నీటిలోనే నివసిస్తున్నట్టు సమాచారం.