బీఆర్ఎస్ జాబ్స్ ఊడగానే తెలంగాణ యువతకు ఉద్యోగాలొస్తున్నాయి : సీఎం రేవంత్

-

గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించి బీఆర్ఎస్‌ను గద్దె దింపారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యానికి మళ్లీ ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్‌ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని మీకు చెప్పామని.. కల్వకుంట్ల కుటుంబం ఉద్యోగాలు ఊడగొట్టినందునే మీకు ఉద్యోగాలు వస్తున్నాయని తెలిపారు.

పోలీసు, ఎక్సైజ్‌, ఫైర్‌ శాఖల్లో 13,444 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. త్వరలో గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 567 గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లకు అనుమతిచ్చినట్లు చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సోషల్ వెల్ఫేర్ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో రేవంత్ పాల్గొన్నారు.

“ఇటీవలే గ్రూప్‌-4 ఫలితాలు విడుదల చేశాం. ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి బీఆర్ఎస్‌కు సమయం దొరకలేదు. ఉద్యోగ నియామకాల చిక్కుముడులు విప్పుతున్నాం. దోచుకోవాలి.. దోచుకున్నది దాచుకోవడంపైనే బీఆర్ఎస్ నేతలు దృష్టిపెట్టారు. కాంగ్రెస్‌ వచ్చాక ఉద్యోగ నియామకాలపై పూర్తి దృష్టిపెట్టాం. మేడిగడ్డ పేకమేడల్లా కూలిపోయే పరిస్థితి నెలకొంది. సాగునీటి ప్రాజెక్టులపై రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేని దోపిడీ ప్రభుత్వం కేసీఆర్‌ది. మేడిగడ్డ కూలితే ఎవరికీ తెలియకుండా పహారా మధ్య నిర్బంధించారు.” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version