సీఎం రేవంత్.. వెంటనే ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల విడదల చేయాలి : బూర నర్సయ్య గౌడ్

-

రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని వెంటనే అందుకు సంబంధించి నిధులను విడుదల చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థు ఫీజులకు సంబంధించి రూ.7,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిధుల నిలిపివేతలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో కళాశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తే.. గత ప్రభుత్వాన్ని అడగాలంటూ సమాధానం చెప్పడం కరెక్ట్ కాదన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో వివిధ కళాశాలలు, పాఠశాలలకు పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్ల బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఆ బకాయిల విడుదలపై ఉన్న శ్రద్ద ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఎందుకు లేదని ప్రశ్నించారు. అదేవిధంగా రూ.2 వేల కోట్లకు టోకెన్లను ఇచ్చిన సర్కార్ డబ్బులు మాత్ర ఇంకా చెల్లించలేదని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,400 కోట్ల ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఎవరైనా నిరుపేదలు ఆసుపత్రులకు వెళితే.. ప్రైవేటు ఆసుపత్రులు చికిత్స చేసే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి నిధుల విడుదల చేయాలని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version