తండ్రి పేరు చెప్పుకుని పదవుల్లో కూర్చున్న వ్యక్తిని కాదు నేను : సీఎం రేవంత్

-

తాను తండ్రి పేరు చెప్పుకుని పదవుల్లో కూర్చున్న వ్యక్తిని కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దుర్మార్గులను, అవినీతిపరులను తొక్కుకుంటూ వచ్చివ వ్యక్తినని తెలిపారు. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ కుటుంబానికి ఈ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ తన కుటుంబీకుల ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచించారన్న రేవంత్ గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను పూర్తిగా మరిచారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలలలోపే 25 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి ఊపు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఏమాత్రం తగ్గలేదని, అసెంబ్లీ ఎన్నికల ఉత్సాహాన్ని లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో అణచివేతకు గురికాని వర్గం ఒక్కటీ లేదన్న రేవంత్.. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటులో ఎందరో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణుల త్యాగాన్ని ఎప్పటికీ మరిపోను, వాళ్ల రుణం తీర్చుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news