ఇవాళ్టితో ముగియనున్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన

-

గత పది రోజులకుపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో భాగమయ్యారు. రేవంత్ బృందం ముందు అమెరికాలో పర్యటించి రాష్ట్రానికి రూ.31,532 కోట్లకుపైగా పెట్టుబడులు తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బృందం దక్షిణ కొరియాలో పర్యటించింది.

ప్రస్తుతం సియోల్లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశీ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది. నేడు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం చర్చలు జరపనుంది. ఈరోజు హన్‌ రివర్‌ ఫ్రంట్‌, కొరియన్‌ స్పోర్ట్స్ వర్సిటీని సందర్శించనుంది. సింగపూర్‌ మీదుగా రేపు హైదరాబాద్‌ రానున్నారు. ఇక సోమవారం రోజున సియోల్లో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎల్ ఎస్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని కోరారు. మరోవైపు కొరియా జౌళి శాఖ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ లో పాల్గొన్న సీఎం రేవంత్ వారిని వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news