దావోస్ లో గౌతం అదానీతో భేటీ అయిన సీఎం రేవంత్‌ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన చాలా బిజీబిజీగా కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన దావోస్లో వేట సాగిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పలువురు ప్రముఖ భారతీయ దిగ్గజ సంస్థల ఛైర్మన్‌లు, ప్రతినిధులతో సమావేశమయ్యారు.

మొదట టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సీఎం రేవంత్ భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులపై టాటా ప్రతినిధులతో చర్చించారు. పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న అనువైన పరిస్థితుల గురించి వారికి వివరించారు. ‌అనంతరం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ, జేఎస్డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్ సజ్జన్ జిందాల్‌తో రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదానీ గ్రూప్ తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ మొత్తం నాలుగు ఒప్పందాలు చేసుకుంది.

మరోవైపు గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ విలియం వార్‌తోనూ సీఎం రేవంత్ సమావేశమయ్యారు. రేవంత్ టీమ్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదీతరలు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version