హైద‌రాబాద్ లో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి – సీఎం రేవంత్

-

హైద‌రాబాద్ లో పిల్ల‌ల కోసం క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. పుర‌పాల‌క ప‌రిపాల‌న శాఖ‌పై సీఎం స‌మీక్ష‌ నిర్వహించారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…కొత్త‌గా ఏర్ప‌డిన 85 మున్సిపాలిటీల్లో క‌మిష‌న‌ర్లు లేక‌పోవ‌డంపై ఆశ్చ‌ర్యం అన్నారు. గ్రూప్ 1 అధికారులు క‌మిష‌న‌ర్‌లుగా ఉండేలా చూడాల‌ని ఆదేశించారు.

CM Revanth issued orders to set up playgrounds for children in Hyderabad

కొత్త కార్పొరేష‌న్ల‌కు ఐఏఎస్‌ల‌ను క‌మిష‌న‌ర్‌లుగా నియ‌మించాల‌ని సూచ‌న‌లు చేశారు.మున్సిపాలిటీల్లో ప‌ని చేసే మున్సిప‌ల్ వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌మాద బీమా క‌ల్పించ‌డంపై అధ్య‌య‌నం చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ ఎంసీలో వ‌య‌స్సుపైబ‌డిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ స‌భ్యుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి సూచ‌న‌లు చేశారు. ఆస్తి ప‌న్ను మ‌దింపు కోసం డ్రోన్ కెమెరాల‌ను ఉప‌యోగించేందుకు అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం ఆదేశాలు ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ప్రైవేట్ సెక్టార్‌లో మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచ‌న‌లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news