దావోస్ నుంచి లండన్‌కు చేరుకున్న సీఎం రేవంత్‌ టీమ్

-

మూడు రోజుల దావోస్‌ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులు గురువారం లండన్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు. వారికి ప్రవాస తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు. రేవంత్ వస్తున్నారని తెలియగానే ప్రవాసులంతా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయన రాగానే ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలి అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రేవంత్ తన అభిమానులకు అభివాదం చేశారు.

మరోవైపు దావోస్‌లో చివరి రోజున గురువారం రోజున ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పలు సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పెట్టుబడుల ప్రచార ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టాటా, సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌, క్యూ సెంట్రియో, ఉబర్‌, సిస్ట్రా, ఓ9 సొల్యూషన్స్‌ తదితర సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో సంస్థల ప్రతినిధులు పరస్పర అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ) కుదుర్చుకున్నారు. వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ విజేత డేవిడ్‌ నబారోతో రేవంత్‌ భేటీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news