నేడు సీఎం రేవంత్ రెడ్డి కేసు విచారణ

-

రిజర్వేషన్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై  కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు ఇవాళ విచారించనుంది. రిజర్వేషన్లను తీసేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని.. గతంలో ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రజా ప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు.

దీంతో ప్రజా ప్రతినిధ్య చట్టంలోని 499, 125 సెక్షన్ల కింద రేవంత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. ఆ కేసును ఇవాళ కోర్టు విచారించనుంది. మరోవైపు అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులందరూ  గైర్హాజరు అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు కావడంతో అక్టోబర్ 16న హాజరు కావాలని ఆదేశించింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version