గ్రూప్ -1 మెయిన్స్ పై సీఎం రేవంత్ రెడ్డి….మరో ప్రకటన చేశారు. గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి…ఈ మేరకు ప్రకటన చేశారు.
ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయమని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అభ్యర్థులను కోరారు రేవంత్ రెడ్డి.
ఇది ఇలా ఉండగా… గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది కాబట్టి ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరీక్షలు వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి యదావిధిగా పరీక్షలు జరుగనున్నాయి.