డబ్బు.. ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. ఎవరెన్ని చెప్పినా డబ్బుంటేనే మనిషికి ఖానా, పీనా, గౌరవం.. ఇంకా అన్నీ. డబ్బుల్లేకపోతే పరిస్థితి నార్మల్ గా అస్సలు ఉండదు. అయితే చాలామంది డబ్బు విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
ముఖ్యంగా డబ్బు సంపాదించే వయసైన 30లలో ఎక్కువ తప్పులు చేస్తుంటారు. మీ వయసు 30లలో ఉన్నట్లయితే డబ్బు విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.
ఫైనాన్షియల్ ప్లాన్ లేకపోవడం:
డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి, ఏ విధంగా సేవ్ చేయాలి అనే విషయంలో ప్లాన్ లేకపోవడమనేది అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీ డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుంటుంది. అందుకే, డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనే ప్లాన్ మీ దగ్గరుండాలి.
అత్యవసర ఖర్చుల కోసం పొదుపు చేయకపోవడం:
ఎమర్జెన్సీ ఫండ్ అనేది ప్రతీ ఒక్కరికీ ఖచ్చితంగా ఉండాలి. డబ్బు అవసరాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. అలాంటి సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ పనికి వస్తుంది. మీ సాలరీ ఎంత అయినా ఎంతో కొంత అమౌంటుని ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవ్ చేయాలి.
అధిక వడ్డీకి అప్పులు:
అప్పులు అధిక వడ్డీకి తీసుకోవడం వల్ల వాటి వడ్డీలు కట్టడానికే శాలరీలు ఖర్చు ఐపోతుంటాయ్.. సో.. వడ్డీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం:
డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక చాలామంది తికమకపడుతుంటారు. ఇలాంటప్పుడు ప్రొఫెషనల్ అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. తెలియని ప్రోడక్టుల్లో పెట్టుబడి పెట్టి మోసపోకుండా చూసుకోండి.
రిటైర్మెంట్ ప్లానింగ్ చేయకపోవడం:
కాలం మనకోసం ఆగదు కాబట్టి వయసు పెరుగుతూనే ఉంటుంది. 30లలో ఉన్నంత ఎనర్జీగా 60లలో ఉండరు. ఆ సమయంలో ఆర్థికంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండేందుకు ఇప్పటి నుండే రిటైర్మెంట్ కోసం డబ్బును ఆదా చేయండి. మానవ సంబంధాలు పలుచబారుతున్న ఈ పరిస్థితుల్లో నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి.