ఉస్మానియా డాక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

-

హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని పేగు మార్పిడి ఆపరేషన్ ను విజయవంతం చేసిందుకు  సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. షార్ట్ గట్ సిండ్రోమ్ తో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి ఎన్ని ఆసుపత్రులు తిరిగినా నయం కాకపోవడంతో చివరికి ఉస్మానియా ఆసుపత్రికి వచ్చాడు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ఆ వ్యక్తికి శస్త్ర చికిత్స చేసేందుదు ముందుకు వచ్చారు. దేశంలోనే తొలిసారిగా పేగు మార్పిడి ఆపరేషన్ ను విజయవంతం చేయడం విశేషం.

ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు. అంతేకాదు.. ద్రవ ఆహార పదార్థాలను సులభంగా తీసుకోగలుగుతున్నాడు. ఈ ఆపరేషన్ ఒక్క తెలంగాణలోనే యావత్ భారతదేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వైద్య రంగంలోని మొట్టమొదటి విజయవంతమైన పేగు మార్పిడి ఆపరేషన్ గా నిలిచింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ చారిత్రాత్మక విజయం మన రాష్ట్రానికే కాదు.. దేశానికే గర్వకారణం అన్నారు. వైద్య బృందాన్ని అభినందిస్తూ పబ్లిక్ హెల్త్ కేర్ రంగంలో ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు కొత్త బెంచ్ మార్క్ ను నెలకొల్పారని కొనియాడారు. 

Read more RELATED
Recommended to you

Latest news