సీఎం రేవంత్ రెడ్డికి ఆ అర్హత లేదు.. బాల్కసుమన్ కీలక వ్యాఖ్యలు

-

చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. 40 లక్షల గ్యాస్ కనెక్షన్స్కు మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెబుతున్నారన్నారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు వెళ్లే సత్తా వుందా అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదు అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపునకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారన్నారు. క్రిష్ణా నదిపై వున్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు రేవంత్ రెడ్డిని పొగడాలా అన్నారు. రూ.4000 పింఛన్, రైతు రుణమాఫీ ఎటు పోయిందని ప్రశ్నించారు. బూతు పురాణాలు, అబద్ధాల ప్రచారం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏ.డీ లా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ, సచివాలయం, మేడారం జాతర ఎక్కడైనా రేవంత్ రెడ్డి భాష ఒకటే విధంగా వుందన్నారు. రేవంత్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news