హైదరాబాద్లో సన్‌బర్న్‌ ఈవెంట్.. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

-

హైదరాబాద్ మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. గతేడాది కంటే రెట్టింపు ఉత్సాహంతో అంతకు మించినంత గ్రాండ్గా ఈ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకునేందుకు నగర ప్రజలు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే నగరంలో నూతన సంవత్సర ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో సన్బర్న్ పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.

సన్బర్న్ ఈవెంట్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఏ రాష్ట్రంలో జరిగినా ఈ ఈవెంట్ ఏదోరకమైన వివాదం సృష్టించక మానదు. అలాంటి వివాదాస్పదమైన ఈసారి హైదరాబాద్ మాదాపూర్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయినా ఆన్లైన్లో టికెట్ల విక్రయం జరుగుతోంది.

ఈ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి చెవిన చేరింది. దీంతో ఆయన ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్కు అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే ఆన్‌లైన్‌లో బుకింగ్‌లు ఎలా ప్రారంభించారని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో వెంటనే సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు ఈవెంట్‌ నిర్వాహకుల్ని, బుక్‌ మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version