సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇచ్చారు. యేసు క్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. యేసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎప్పుడూ ప్రజలపై ఉండాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.