తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిని అవమానించారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఏబీఎన్ ఇంటర్వ్యూలలో రేవంత్ రెడ్డి శాసన మండలిని ఇరానీ కేఫ్ తో, సభ్యులను రియల్టర్లతో పోల్చడాన్ని దాసోజు తప్పు బట్టారు. ఇలాంటి నాయకుడు ఉంటే రాస్ట్రాన్ని దేవుడే కాపాడాలి. రేవంత్ రెడ్డి ప్రతి పక్షంలో ఏం మాట్లాడినా నడిచింది. కానీ, ఇప్పుడు సీఎం అనేది గుర్తుంచుకోవాలి. బురద జల్లే రాజకీయాలు కాకుండా పాలనపై దృష్టి సారించాలి అని సూచించారు.
మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఆర్థికభారం పడేలా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రజలకు న్యాయం చేయడం లేదన్నారు. రూ.500 గ్యాస్ పథకం అమలు చేయడం ద్వారా ప్రభుత్వంపై నెలకు రూ.350 కోట్ల భారం మాత్రమే పడుతుంది. రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయాలా? లేదంటే, కంపెనీకి చెల్లించాలా? అన్న విషయమై మంత్రుల బృందం ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.