ఏం అభివృద్ధి చేసారు మూడుసార్లు గెలిచి: తిక్క రెడ్డి

-

మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు టిడిపి నేత పాలకుర్తి తిక్కరెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న టైం లో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. నేతలు అప్పుడే జోరుగా ప్రచారంలోకి దిగారు. గవిగట్టు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో తిక్కా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పై ఫైర్ అయ్యారు.

ఇసుక వ్యాపారం, భూ దందాలు, ఆక్రమ మద్యం వ్యాపారం చేస్తూ సంపాదనపై పడ్డారు తప్ప మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు చేసేదేమీ లేదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మీద ఫైర్ అయ్యారు తిక్కారెడ్డి. ఇసుక వ్యాపారం కారణంగా నియోజకవర్గంలో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలనాగిరెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పాలకుర్తి తిక్కరెడ్డి ఇలా కామెంట్స్ చేశారు టిడిపి వరుస కార్యక్రమాలని నిర్వహిస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయమే తన టార్గెట్ అని అంటోంది వైసిపి.

Read more RELATED
Recommended to you

Latest news