రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చలు జరుపుతున్నారు. అంతే కాకుండా కొత్త పథకాలకు సంబంధించి ఆదాయ మార్గాలు, అభయహస్తం పథకాల అమలు ప్రారంభం గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన Prajapalana.telangaana.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. గత నెల 28ల తేదీన ఈనెల 6వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,24,85,383 దరఖాస్తులు రాగా వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు , రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.