ఇవాళ జపాన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. కారణం ఇదే

-

నేడు జపాన్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 8 రోజుల పాటు జపాన్ లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు నేడు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటన ఉంటుంది.

CM Revanth Reddy to leave for Japan today

ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతారు సీఎం రేవంత్ రెడ్డి. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా కోరనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news