ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈనెల 3వ తేదీన అమెరికాలో పర్యటించనుంది. శనివారం రోజున తెల్లవారు జామున సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,రామకృష్ణ రావు, జయేష్ రంజన్, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్దన్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ధిల్లీ ప్రభుత్వ పీఆర్వో ఉదయ్ రెడ్డిలతోపాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలు అమెరికా వెళ్లుతున్నట్లు సమాచారం.
అమెరికాలోని న్యూజెర్షీ, న్యూయార్క్, వాషింగ్ టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ బృందం పర్యటించనుంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనున్నట్లు తెలిసింది. మరోవైపు యూఎస్ పర్యటన అనంతరం ఈ టీమ్.. దక్షిణ కొరియాలోని సియోల్‌లో పర్యటించనుంది. మూడో తేదీ తెల్లవారు జామున 3.45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరతారు. ఎనిమిది రోజులపాటు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో ఈ బృందం పర్యటిస్తుంది. తిరిగి ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌కు వస్తారు.