నేటితో ముగియనున్న బడ్జెట్ సమావేశాలు

-

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఇవాళ్టి సభలో భూమి హక్కులు, సంస్కరణలపై చర్చ జరగనుంది. ఇవాళ మూడు బిల్లులపై అసెంబ్లీలో చర్చించనున్నారు. సివిల్ కోర్టుల సవరణ బిల్లు, తెలంగాణ చట్టాలు, పబ్లిక్ సర్వీస్ నియామకాల నియంత్రణ బిల్లుపై చర్చ సాగనుంది. మరోవైపు కాగ్ నివేదికలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. స్కిల్ యూనివర్శిటీ సహా ఇతర బిల్లులపై మండలిలో చర్చ కొనసాగుతుంది.

మరోవైపు ఇవాళ్టి సమావేశాల్లో ప్రత్యేక సంఘటన చోటుచేసుకోనుంది. నేటి శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. నిరుద్యోగులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న తరుణం ఇవాళ వచ్చేసింది. నేడు శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించి.. దానికి చట్టబద్ధత తీసుకురానున్నారు. ఏటా నిర్దిష్ట కాలవ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.

జులై 23వ తేదీన శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టారు.. 26, 28 తేదీల్లో శాసనసభకు సెలవు ప్రకటించగా.. 27న బడ్జెట్పై సాధారణ చర్చ.. 29న 19 పద్దులపై చర్చ జరిగింది. 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించగా.. ఆగస్టు ఒకటవ తేదీన సభలో పలు అంశాలపై చర్చించారు. ఇక ఇవాళ పలు బిల్లులపై చర్చ, ఆమోదం జరిగిన తర్వాత సభ నిరవధిక వాయిదా పడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version