ఇందిరమ్మ ఇండ్ల నమూనాను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రెడ్డి మాట్లాడుతూ… పేదవాడు గ్రామాల్లో ఆత్మగౌరవంతో బ్రతకాలి.. అంటే ప్రతీ పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఆలోచన ఇందిరమ్మ చేసి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.
మళ్లీ ప్రజా పాలన వచ్చిన తరువాత ఇవాళ మళ్లీ బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు. ఇల్లాలు ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క.. ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలని తమ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ బిడ్డ పేరిట ఉంటేనే ఆ ఇల్లు గౌరవంగా ఉంటుందన్నారు.