నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వారంలో రెండో సారి ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ రెడ్డి…అధిష్టానం పిలుపు మేరకు బయలు దేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంఛార్జి దీపదాస్ మున్షీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీకి హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంఛార్జి దీపదాస్ మున్షీ.
కాగా, ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే దాదాపు 10 సార్లకుపైగా ఢిల్లీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది ఇలా ఉండగా,తెలంగాణ రాష్ట్రంలో అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావటంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్తును అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్ కు సరిపడేంత విద్యుత్తు అందుబాటులో ఉందని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు.