రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మొదటి రెండు రోజులు కొత్తగా ఎంపికైన లోక్ సభ సభ్యులకి సంబంధించిన ప్రమాణ స్వీకారం కొనసాగనున్నది. ఈ కార్యక్రమానికి సీఎం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రాభివృద్ధిపై చర్చించనున్నారు. ఇక పలు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఏఐసీసీ పెద్దలతో కూడా భేటీ అయి కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పై పార్టీ పెద్దలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పార్టీలో పదవులు ఆశిస్తున్న ఆశావాహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎవరెవరికీ ఏయే పదవులు దక్కుతాయో, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news