ఇక పై వారికి రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్..!

-

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు.  ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారని తెలిపారు.  ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు.

ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రూ.2 లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, రుణమాఫీ ప్రాసెస్ ని వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు. రెండు లక్షల రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ సైతం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని మేము మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news