రేపు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ హాస్టళ్ల తనిఖీ

-

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను స్వయంగా అంచనా వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు సంక్షేమ హాస్టళ్ల తనిఖీ చేపట్టనున్నారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలతో  సహా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు అధికారులు గురుకుల రెసిడెన్షియల్ హాస్టళ్లను శనివారం వ్యక్తి గతంగా సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేసి పరిస్థితులను అంచనా వేయనున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకుల హాస్టళ్లలోని దాదాపు 8 లక్షల మంది విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం కాస్మోటిక్ చార్జీలు 200 పెంచుతూ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలో 667.25 కోట్లతో మౌళిక సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది. హాస్టళ్ల పని తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకునూరి మురళి అధ్యక్షతన స్టేట్ ఎడ్యూకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్నీ అసెంబ్లీ నియోజకవర్గం ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news