అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని ఎవరైనా నిరసన తెలిపితే వాళ్ళని కూడా జైల్లో వేస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఎవరి కోసమైనా నిరసనలు జరుగుతాయని.. 10-20 మంది గుమి కూడినంత మాత్రాన అది నిరసన అయిపోదంటూ వ్యాఖ్యానించారు. అనుమతి లేకుండా ఎవ్వరూ నిరసన చేసినా వాళ్లను జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. తొక్కిసలాటలో ఓ నిరుపేద మహిళా చనిపోతే ఆమె గురించి మాట్లాడకుండా ఘటనకు కారణమైన వ్యక్తి పై చర్చ ఏంటి..? అని ప్రశ్నించారు.
ఓ మహిళా ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా..? అని ప్రశ్నించారు. ఆ కుటుంబం ఎలా ఉంది అని అడగరు. వాళ్ల అబ్బాయి 11 రోజుల నుంచి కోమాలో ఉన్నాడు. కోమాలో నుంచి బయటికి వస్తే వాళ్ల అమ్మ కనిపించదు. నేను తీసుకునేది ఏముంది..? అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి తెలుసు.. సినిమా వాళ్లు డబ్బులు పెట్టి సంపాదిస్తున్నారని.. వాళ్లేమైనా ఇండియా-పాక్ బోర్డర్ లో యుద్ధం చేస్తున్నారా..? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.