అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. అందుకోసమేనా..?

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్ట్ ప్రాంతాల ముఖ్యమంత్రి, హోమంత్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ, సీఎస్ శాంతికుమారిలు హాజరయ్యారు. 2026 వరకు మావోయిస్టులను అంతం చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు అమిత్ షా.

ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తాజాగా అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణకు వరద సాయం పెంచాలని రిక్వెస్ట్ చేశారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారం, అభివృద్ధి పథకాలకు  కావాల్సిన నిధులపై కేంద్ర సహకారం కావాలని కోరారు. మూసీ ప్రక్షాళన చేపట్టిన నేపథ్యంలో నమామీ గంగ తరహాలో నిధులు కేటాయించాలని కోరారు. ఐఏఎస్, ఐపీఎస్ ల గురించి కూడా చర్చించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 416.80 నిధులు కేటాయించింది. మరికొన్ని నిధులు కేటాయించాలని హోంమంత్రి అమిత్ షాతో భేటీలో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి.  

Read more RELATED
Recommended to you

Latest news