ఎమ్మెల్యేలకు నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్ లో జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. కులగణన చేసి దేశంలో ఓ చరిత్ర సృష్టించామని.. రాష్ట్రంలోని ప్రతీ మూలన సమగ్రంగా సర్వే చేసి పకడ్బందిగా సమాచారాన్ని సేకరించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సాహసాన్ని చూసి కులగణన జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ పై కూడా ఒత్తిడి వస్తుందన్నారు. 

కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం

కులగణన, ఎస్సీ వర్గీకరణకు రోడ్డు మ్యాప్ అందించామని కామెంట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణనతో దాదాపు  76 కులాలకు న్యాయం జరుగనుంది. కొందరూ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. కేటీఆర్ సిరిసిల్లలో సూసైడ్ చేసుకుంటాడేమోనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి వారికి నోటీసులు ఇవ్వడం ప్రొసిజర్ లో భాగమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news