కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

-

కులగణన సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం మాట్లాడారు.  ఫిబ్రవరి 04, 2024న కులగణన సర్వే చేపట్టనున్నట్టు  ప్రభుత్వం నిర్ణయించిందని..  ఫిబ్రవరి 04, 2025న అసెంబ్లీలో కులగణన సర్వే ప్రవేశపెట్టినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం.. కులగణన, సమగ్ర సర్వే విజయంతంగా పూర్తి చేశామని తెలిపారు.

వెనుకబడిన తరగతి వర్గాల అభ్యున్నతి కోసమే కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.  సర్వే కవరేజ్ ను 96.9 శాతంగా సూచిస్తుంది. జీహెచ్ఎంసీ, ఇతర నగర ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను సర్వే చేయలేదని తెలిపారు. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి 36 రోజుల సమయం పట్టింది. సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ సభలో ప్రవేశపెట్టామని తెలిపారు. 66,99, 602 కుటుంబాల సమాచారాన్ని సేకరించామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మొత్తం 56.33 శాతం బీసీల జనాభా ఉన్నారు. ముస్లిం మైనార్టీలు 2.48 శాతం మంది ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news