‘మేడిగడ్డ’ గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలనేదే మా ఉద్దేశం: సీఎం రేవంత్‌రెడ్డి

-

మేడిగడ్డ పర్యటనకు బయల్దేరే ముందు నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత సర్కార్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్‌ అనే బ్రహ్మపదార్థాన్ని కనిపెట్టి అనవసరపు ఖర్చు చేసి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. తెలంగాణకు ప్రధానంగా తాగు, సాగునీటి కోసం కృష్ణా, గోదావరి జలాల్లో కృష్ణా జలాలపై ఇప్పటికే కొంత మేర శాసనసభలో చర్చించామని తెలిపారు. వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు వివరించగలిగామని వెల్లడించారు. ఇక గోదావరి జలాల గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

“రీ డిజైన్ పేరుతో తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఇలా బ్యారేజీలు కట్టుకుంటూపోయారు. చివరకు రూ.38,500 కోట్ల అంచనాతో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.1.47 లక్షల కోట్లకు పెంచారు. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. అంచనాలు ఎలా పెంచారు? రీడిజైనింగ్ ఎలా చేశారు? అందులో సాంకేతికపరమైన అంశాలు ఏమున్నాయి? రీడిజైనింగ్‌కు సంబంధించి నిపుణులు ఇచ్చిన డీపీఆర్‌ ఎక్కడ?ఆ తర్వాత జరిగిన నిర్మాణం, నిర్వహణ.. ఇవన్నీ ఇప్పటికీ ప్రశ్నల్లాగే మిగిలాయి.” అని రేవంత్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version