కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

-

ఎప్పుడైతే ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉంటారు. దానికి ముఖ్య కారణం సానుకూల శక్తి అనే చెప్పవచ్చు. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తారు. అయితే ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తితో జీవించాలంటే తప్పకుండా కొన్ని మార్పులను చేయాలి. ముఖ్యంగా ఇటువంటి వస్తువులను ఇంట్లో ఉంచడం వలన ఎన్నో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వాస్తు శాస్త్రంలో చెప్పినటువంటి వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచకండి. చాలా మంది కొత్త బట్టలను కొనుక్కొని పాత బట్టలను తొలగించకుండా ఉంచేస్తారు. దీనివలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

ఎప్పుడైతే బట్టలు చిరిగిపోతాయో లేక పనికి రాకుండా ఉంటాయో, అటువంటి దుస్తులను ఎవరికైనా ఇవ్వడం మేలు. పాత బట్టలను ఇంట్లో ఉంచడం వలన కెరియర్ మరియు ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. సహజంగా ప్రతి ఒక్కరూ పాత న్యూస్ పేపర్లను ఇంట్లో ఉంచుతారు. కాకపోతే వీటి వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. దాంతో కుటుంబ సభ్యులు అస్సలు ఆనందంగా ఉండలేరు. పైగా గొడవలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వాస్తు శాస్త్రం ప్రకారం తెగిపోయినా లేక ఉపయోగించని షూలు, చెప్పులు వంటివి ఇంట్లో ఉంచకూడదు. ఎప్పుడైతే ఇంట్లో పనికిరాని చెప్పులు ఉంటాయో జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే అవసరం లేని చెప్పులను శనివారం రోజున తొలగించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తికి పాత తాళాలు కూడా కారణమే అని చెప్పవచ్చు. పనిచేయని తాళాలు లేక విరిగిపోయిన తాళాలను ఇంట్లో ఉంచడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వెంటనే వీటిని తొలగించడం మేలు. వీటితో పాటుగా పనిచేయని గడియారాలను కూడా ఇంట్లో అస్సలు ఉంచకూడదు. పనిచేయని గడియారాలు ఉంచడం వలన ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. దాంతో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కనుక వాటిని రిపేర్ చేయించడం లేదా తొలగించడం వంటివి చేయాలి. ఇటువంటి చిన్న చిన్న మార్పులను చేయడం వలన జీవితంలో ప్రతికూల శక్తి తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news