సికింద్రాబాద్ నగర ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయం కలగనుంది. ఈ రూట్ లో భారీ ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 11.3 కిలోమీటర్ల పొడవు మేర 6 లేన్లతో కారిడార్ను రాష్ట్ర సర్కార్ నిర్మించనుంది. నేడు అల్వాల్‌లోని టిమ్స్ సమీపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు.
11.3 కిలోమీటర్ల పొడవు మేర 6 లేన్లతో నిర్మించనున్న ఈ కారిడార్‌తో హైదరాబాద్ – రామగుండం రహదారికి మహర్దశ పట్టనుందని నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత వాసులు కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు సాఫీగా ప్రయాణించవచ్చు. రేవంత్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం వస్తున్నందున ఆ రూట్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ కార్యక్రమం అనంతరం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ దిల్లీ వెళ్లనున్నారు.