మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం !

-

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇటీవల లండన్, దుబాయ్ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయ్లోనే పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

CM Revanth’s key decision on Musi riverfront project

తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ, మూసీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మెయిన్హార్డ్ట్(MEINHARDT) కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్లో మూసీ డెవెలప్మెంట్కు అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ నమూనాలు రూపొందించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news