గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన పంచాయితీ నిధులను పబ్జి స్టార్ జగన్ మోహన్ రెడ్డి స్వాహా చేశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు విమర్శించారు. పంచాయితీ వ్యవస్థను ఇంత దారుణంగా దెబ్బతీసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని సభ్య సమాజానికి దూరంగా పెట్టాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఒక్క పౌరునిపై ఉందని ఆయన అన్నారు. వాలంటీర్లను చూసుకొని విర్రవీగుతున్న వ్యక్తిని సమర్ధించకూడదని, పంచాయతీ వ్యవస్థకు ఇలాంటి దురావస్థను తీసుకువచ్చిన దుష్ట పాలకుల్ని భూస్థాపితం చేయాలని అన్నారు.
సర్పంచులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడే ఈ దుష్ట పాలకుల పతనానికి నాంది కాబోతోందని, ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతిజ్ఞ బూనాలను రఘురామకృష్ణ రాజు గారు కోరారు. నిజమైన ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లేనని, ఎటువంటి పార్టీ గుర్తులు లేకుండా గతంలో తాము చేసిన సేవలకు, ఇంటింటికి తిరిగి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని ప్రజలు వేసిన ఓట్లతో వారు గెలుస్తారని అన్నారు. పంచాయితీ వ్యవస్థ ద్వారా గ్రామీణ వ్యవస్థ బలోపేతం అవుతుందని, గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ స్వరాజ్యాన్ని సాధించవచ్చునని జాతిపిత మహాత్మా గాంధీ గారు చెబితే, అభినవ గాంధీగా చెప్పుకునే పబ్జి స్టార్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను ఎంతో బ్రష్టు పట్టించారని తెలిపారు.