తెలంగాణ న్యాయవ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలవాలి: సీఎం కేసీఆర్‌

-

హైదరాబాద్ గచ్చిబౌలిలో న్యాయాధికారుల సమావేశం ఇవాళ జరిగింది. న్యాయధికారుల సమావేశానికి ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని.. న్యాయ రంగంలోనూ పురోగమించేలా కృషి చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. పరిపాలన సంస్కరణలు తీసుకు వచ్చి.. 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.. ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టు లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హైదరాబాద్ పై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అమితమైన ప్రేమ ఉందని.. హై కోర్టు లో న్యాయ మూర్తుల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఙతలు తెలిపారు. న్యాయ వ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు స్పస్టం చేశారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news