సీఎం కు బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదు? – భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదు? అని ప్రశ్నించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు. 9వ తేదీన నిమజ్జనం జరుగుతుందని.. అనంత చతుర్దశి రోజున నిమర్జనం చేయాలని అన్నారు. శుక్రవారం నిమజ్జనం చేయవద్దని వదంతులు సృష్టిస్తున్నారని ,వాటిని నమ్మవద్దని సూచించారు.

హై కోర్ట్ ఆదేశాలు ఎప్పటిలానే నిమజ్జనం చేసుకోమని ఉన్నాయని తెలిపారు. “ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫో లేదు…పాండ్స్ ఏర్పాటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.పాండ్స్ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదు. ఉత్సవాలను వ్యతిరేకించే వారు అక్కడ ఉంటే ఇబ్బందులు తప్పవు.నిమజ్జనం విషయంలో పోలీసుల నుండి ఎలాంటి వత్తిడి తీసుకరావద్దు.బాలాపూర్ గణేష్ వారికి కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు వినాయక సాగర్ లో నిమజ్జనం వద్దు అని.నిమజ్జనం వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందని అంటున్నారు. దీనివల్ల ఎలాంటి కాలుష్యం జరగదు.బతుకమ్మ ఉత్సవాల పై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాల పై ఎందుకు లేదు? ప్రభుత్వం, సీఎం స్పందించాలి. ఎలాంటి అపశృతి జరిగిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.నిమజ్జనంకు ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రి వస్తున్నారు”. అని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version