హైదరాబాద్ మహానగరంలోని హోటళ్లలో ఏదో ఒక చోట కలుషిత ఆహారం ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. మొన్నటివరకు సాంబార్, చట్నీల్లో బొద్దింకలు, పురుగులు, ఎలుకలు,బల్లులు దర్శనమిచ్చిన ఘటనలు మరువక ముందే తాజాగా కూకట్ పల్లిలోని మరో హోటల్‌లోని చట్నీలో బొద్దింకలు దర్శనమిచ్చాయి.
కూకట్‌పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75లోని మధురం టిఫిన్స్‌లో కస్టమర్‌కు అందించిన టిఫిన్స్‌లోని చట్నీలో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి.దీంతో టిఫిన్ ఆర్డర్ చేసిన కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. యాజమాన్యాన్ని ఇదేంటని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. చట్నీలో బొద్దింకలు దర్శనమిచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
👉చట్నీలో బొద్దింకలు…
👉కూకట్‌పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75లోని మధురం టిఫిన్స్‌లో చట్నీలో ప్రత్యక్షమైన బొద్దింకలు.
For More Updates Download The App Now – https://t.co/iPdcphBI9M pic.twitter.com/SNH2Tl3eyS— ChotaNews App (@ChotaNewsApp) December 30, 2024