హైడ్రా పేరుతో వసూళ్ల దందా.. కేటీఆర్ సంచలన కామెంట్స్

-

హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడుస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై
పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్ షేర్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబ రియల్ వ్యాపారం
చేస్తోందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని
దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు రైతు భరోసా రావట్లేదని, రుణ మాఫీ చేయట్లేదని అన్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్.. ఓ బోగస్ అంటూ ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇవ్వరు.. ఉద్యోగాలు వేయరని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశానికే దిక్సూచిగా ఎదిగిన తెలంగాణను 15 నెలల కాంగ్రెస్ పాలనలో అధపాతాళానికి తొక్కేశారని ఆక్షేపించారు. ఆర్థిక శక్తిగా ఎదిగిన రాష్ట్రాన్ని ఆగం చేసి బీద అరుపులు అరుస్తున్నారని అన్నారు. ఇది పాలన కాదు పీడన అని.. ఇది సర్కారు కాదు సర్కస్ కంపెనీ.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news